Kasipet Mandal News/ Pallamguda:- (nov 1)
మిషన్ భగీరథ నీటిని మార్చి నాటికి ప్రతి ఇంటికి అందజేస్తామని మిషన్
భగీరథ చీఫ్ ఇంజనీర్ మనోహర్ తెలిపారు. అయిన గురువారం kasipet మండలంలోని పల్లంగూడ పంచాయతీలో మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను పూర్తిచేసి మార్చి నాటికి ప్రతి ఇంటికి నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి వందరోజుల ప్రణాళికలను నిర్దేశించిందన్నారు. మిషన్ భగీరథ జేఈతో పాటు అదనంగా ఇద్దరు సిబ్బందిని కేటాయించి 100 రోజుల ప్రణాళిక ద్వారా నీటిని అందించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి ఇంటికి బిగించిన నల్ల నుండి నిమిషాలకి ఐదు లీటర్ల నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ పగలగొట్టడంమే కాకుండా కంట్రోల్ వాల్ లను చెడగొడుతున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ముందస్తుగా తాగు నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి వచ్చే వేసవి నాటికి పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అధికారులు చురుగ్గా పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ అజార్, జేఈ వినయ్, పల్లంగూడ సర్పంచ్ విజయ, నాయకులు దుస్స చందు, సిబ్బంది పాల్గొన్నారు.
Source from :- Andhra Jyothy
మీ ఊరిలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 9642474160.
- ప్రజలే రిపోర్టర్లు.