Kasipet mandal news:- కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో మహాత్ముడి
విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తేవడంతో పాటు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అతడి ఆదేశాలతో పాటు స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, ఎంపీటీసీ రామ్ చందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షుడు గొంది రమణ, ఉప సర్పంచ్ సోమని మైసక్క, సపాట శంకర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు కొత్త రమేష్, కంచర్ల పద్మ, పంబాల తిరుపతి, బన్న ఇందుమతి, రాజశేఖర్, నాయకుడు కూకుట్ల దేవేందర్, గాదం గట్టయ్య, బన్న శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
చెత్త బుట్టల పంపిణి:-
Kasipet మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయితీలో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామాలలో స్వచ్ఛత కాపాడాలి అనే నినాదంతో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కుటుంబానికి రెండు చొప్పున చెత్తబుట్టలు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెత్త లేకుండా చేసేందుకు కుటుంబాలకు చెత్తబుట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరు చెత్త బుట్టలో వేసి గ్రామపంచాయతీ సైకిల్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపిటిసి రామ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.