Kasipet Mandal News:- వసతి గృహంలో ఉండలేక విద్యార్థిని
పాఠశాల ప్రహరి దూకి గాయపడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో రమ్యశ్రీ 9వ తరగతి చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లి మంగళవారం పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో ఉండడం ఇష్టంలేక బుధవారం ఉదయం వసతి గృహంలోని వెనుకభాగంలోని ప్రహరి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానిక పి.హెచ్.సి కి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Source from:- eenadu