- పది నెలల్లో 72 మంది బాధితులు.
Kasipet Mandal News:- కుక్కలు ఉన్న గ్రామం లో దొంగలు అడుగుపెట్టడానికి జంకడం ఒకప్పటి మాట. కానీ నేడు ఆ పరిస్థితి తారుమారైంది. సామాన్యులు రాత్రిపూట గ్రామంలో తిరిగే పరిస్థితి
లేకుండా పోయింది. పంటపొలాలు, ఉద్యోగం ముగించుకొని ఇంటికి చేరాలంటే శునకాలు ఎక్కడ దాడి చేస్తాయని బిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి. Kasipet మండలంలోని గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. మండలంలోని 22 గ్రామాల పరిధిలో గ్రామ సింహాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మాంసం దుకాణదారులు నిర్లక్ష్యం మూలంగా ఇవి వీరంగం సృష్టించే స్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా Devapur, Muthyampally గ్రామాల్లో చిన్నారులపై దాడి చేసిన సంఘటనలు కోకొల్లలు. గత జనవరి నుండి మండలంలో 72 మంది పై దాడిచేసి కరిచాయి. దీంతో వారు ఆస్పత్రిలో వెంట తిరగలేక ఇబ్బందులు పడ్డారు. ఈ బెడద ప్రయాణికులకు తప్పట్లేదు. 30 రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్యం పట్ల శ్రద్ధ చూపిన పాలకులు, అధికారులు కుక్కల బెడద తప్పించే మార్గాలపై ఆలోచన చేయకపోవడం పట్ల మండల వాసులు మండిపడుతున్నారు.
- తలలు పట్టుకుంటున్న అధికారులు
మూగ జీవాల సంరక్షణలో భాగంగా ఎనిమల్ ప్రొటెక్షన్ స్వచ్ఛంద సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల శునకాలను చంపడం నేరం అవుతోందని తీర్పులు వంటివి వీటి నియంత్రణకు అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. గతంలో ప్రత్యేక నిపుణుల ద్వారా విషమిచ్చి చంపడం, గ్రామస్తులు ఐక్యoగా తరిమికొట్టి కర్రలతో హతమార్చడం, వైద్యులు వాటి సంతతిని నియంత్రించడానికి చికిత్సలు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం వాటిని చంపకుండా తరలించిన వేరే ప్రాంతాల్లో కూడా రగడ సృష్టిస్తున్నాయి. దీంతో ఎక్కడకు తీసుకెళ్లాలని తలపట్టుకుంటున్నారు.
Source from:- eenadu news