Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గట్రావ్ పల్లిలో పులి?

Kasipet Mandal News / గట్రావుపల్లి:- (oct 17) kasipet మండలం గట్రావ్ పల్లిలో  పులి సంచరిస్తున్నట్లు గత కొన్ని
రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. Devapur డిప్యూటీ రేంజర్ సరోజారాణి దీనిపై స్పందిస్తూ పుకార్ల లో నిజం లేదని తెలిపారు. బండరాళ్లు ఉండే ప్రాంతం కావడంతో పులి సంచరించే అవకాశం లేదని పేర్కొన్నారు. రెండు రోజులుగా వెతుకుతున్న ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదని తెలిపారు. మేకల మంద పై ఏ జంతువులు దాడి చేశాయో ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని ప్రజలకు సూచించారు. గతనెల Devapur కంపెనీలోని మ్యాగ్జిన్ వద్ద అడవి ప్లానిటేషన్ వద్ద చిరుత పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు దొరికాయన్నారు. గట్రావుపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు,  చిరుతపులి సంచరిస్తాయి అని వాటి ఆనవాళ్ల కోసం పూర్తిస్థాయిలో గాలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Source from:- sakshi news. 
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App