Kasipet Mandal News:- ( oct 20 )
తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు నేటికీ పంపిణీకి నోచుకోకపోవడం అనేక విమర్శలకు దారి
తీస్తోంది. Mancherial జిల్లా Kasipet మండలంలో 12 వేల మంది మహిళలను అర్హులుగా గుర్తించినప్పటికీ సకాలంలో చీరలు అందలేదు. మొదటి విడతలో 6,310 చీరలు పంపించగా, రెండో విడతలో 2,400 మూడో విడతలో 640 చీరలను మండల కేంద్రానికి చేరవేశారు. బతుకమ్మ పండగ ముగిసి 10 రోజులు గడుస్తున్నా సకాలంలో చీరలు అందకపోవడం వల్ల బతుకమ్మ చీరలు కార్యాలయానికే పరిమితమయ్యాయి. రెండో విడత డీలర్లకు అందినప్పటికీ చీరలు పంపిణీలో రేషన్ డీలర్లు ఆసక్తి చూపలేదు. దింతో మహిళలకు బతుకమ్మ చీరలు నేటికీ అందలేదు. మూడో విడతలో వచ్చిన చీరలను పంపిణీ చేసేందుకు రేషన్ డీలర్లు అయిష్టత వ్యక్తం చేయడంతో బతుకమ్మ చీరలు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉండిపోయాయి.
మహిళలకు బతుకమ్మ చీరలు అందకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రసాద్ వర్మను వివరణ కోరగా బతుకమ్మ చీరలు నాలుగు రోజుల క్రితమే వచ్చాయని ,వీటిని రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. మండలంలోని అర్హులైన మహిళలందరికీ పూర్తిస్థాయిలో చీరలు రాకపోవడంతో వీటిని ఆపమన్నారు. కొద్దీ రోజుల్లో ఇంకా కొన్ని రానున్నాయని,మొత్తం వచ్చిన తర్వాత చీరలను పంపిణీ చేస్తామని వివరించారు.
source from:- Andhra jyothy