నిధులు ఉన్న.... సాగని పనులు....

ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయ 
లోపం
 పనుల నిర్వహణకు శాపం
ప్రారంభం కానీ 2.20 కోట్ల పనులు

Kasipet Mandal News:- నాయకులు ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి నిధులు తీసుకు వస్తే అధికారులు వాటిని అనుకున్న రీతిలో పనులు చేయించి సమస్యలు పరిష్కరించడం తో పాటు గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలి. Kasipet  మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. నిధులు ఉన్న పనులు ప్రారంభించని నాయకులు, పనులు చేయించాల్సిన బాధ్యతలు మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుతో దొందూదొందే అనే అనే రీతిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గతంలో పరిశ్రమలు ప్రభుత్వాలకు కట్టిన టాక్స్ లతోపాటు పరిసర గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించే వారు. దాంతో పరిశ్రమల ప్రభావిత గ్రామాల్లో ఆ నిధులు కేటాయించి జిల్లా కలెక్టర్ చైర్మన్గా నిధులు ఉపయోగించి బాధిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడం జరిగింది. ప్రభుత్వం ఆ నిధులను జీవో 38 పేరుతో డి.ఎం.ఎఫ్.టి నిధులు గా మార్చింది. దీంతో గత ఏడాది మార్చి 31 నుండి ప్రభుత్వం ఈ నిధులను జిల్లా మంత్రి చైర్మన్ గా,  జిల్లా అధికారులు,  ఎమ్మెల్యేలు,  ఎంపీలు సభ్యులుగా ఖర్చు చేస్తుంది. పరిశ్రమ నిధులు కాస్త ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో   kasipet మండలానికి  డి ఎం ఎఫ్ టి నిధులు ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే 4.13 కోట్లు రోడ్డు నిర్మాణానికి 90 పనులుగా కేటాయించారు. ఐదు లక్షల రూపాయలు దాటితే టెండర్ వేయాల్సి వస్తుందని ప్రతి పని ఐదు లక్షలుగా విభజించి కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు కేటాయించారు. మండలంలో మొత్తం 90 పనులకు గాను ఇప్పటివరకు 40 పనులు మాత్రమే పూర్తయ్యాయి. యాభై పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో నాయకుడు బతుకుతారని పనులు ఇస్తే పనులు చేయకపోవడంతో రోడ్డు పూర్తికాక ఇక్కడి నిధులు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దీనిపై పట్టించుకోవాల్సిన అధికారులు కూడా స్పందించడం లేదు. అధికార పార్టీ నాయకులు కావడంతో కమిషన్లు కూడా ఇవ్వడం లేదంటూ పనులపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శలున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే  ఇంతదూరం తెచ్చిందని పనులు పూర్తి చేసి ఉంటే మరిన్ని నిధులు వచ్చేవని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఎమ్మెల్యే అసంతృప్తి:-

Kasipet మండల అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరుపై నియోజకవర్గ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పనితీరు తెలుస్తుంది. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మీ మండలానికి నిధులు వద్దంటే వేరే మండలానికి కేటాయించుకుంటాం. రెండేళ్లుగా 2 కోట్లకు పైగా పనులు ప్రారంభించకుండా ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా నిధులను సమస్యల పరిష్కారానికి పని చేస్తారు. ఇచ్చిన పనులు పూర్తి చేయకుంటే ఎలా నిధులు వద్దా అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మండలంలో అధికార పార్టీ నాయకులు,  ప్రజాప్రతినిధులు, అధికారుల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కొని రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు సమస్యలపై స్పందించాలని మండల వాసులు కోరుతున్నారు.

 కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ click చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా వార్తలను మీ మొబైల్ కు నోటిఫికేషన్ ద్వారా పొందండి.
Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/