Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఓరియంట్ కంపెనీ లో కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికలను నిర్వహించాలి

Kasipet Mandal News/ Devapur:- (oct 19)
Kasipet మండలంలోని Devapur ఓరియంట్ సిమెంట్ కంపెనీలో గత కొన్ని ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికలు జరుగక కార్మికులు
ఎన్నోరకాలుగా అవస్థలు ఎదుర్కొంటున్నారని, పర్మినెంట్ కార్మికుల ఎన్నికలు జరిపించిన అధికారులు కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికలు కూడా జరిపించాలని కార్మికులు కోరుతున్నారు. 2011 సంవత్సరంలో హైదరాబాద్ వాసి సబాపట్  రాములు నాయక్ కాంట్రాక్టు కార్మికుల ఎన్నికలు ఏకగ్రీవంగా జరుపుకొని అతనే కార్మిక నాయకుడు అంటూ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. స్థానికంగా రాములు నాయక్ ఉండకపోవడంతో కొందరు కార్మికులు యాజమాన్యం పెట్టి ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికలు జరిపి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కొంత మంది కార్మికులు ఇరకాటంలో పడి ఎవరికీ చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారని, ఇలాంటి బాధలు తొలగాలంటే కచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికలు జరపాలని వారు పేర్కొన్నారు.

Source from:- Andhra prabha


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App