బతుకమ్మ చీరల కోసం మహిళల ఎదురుచూపులు

Kasipet Mandal News:- ప్రభుత్వం దసరా పండగను పురస్కరించుకొని మహిళలకు పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు రాకపోవడంతో మహిళలు చీరల కోసం ఎదురుచూస్తూ చుట్టూ
ప్రదక్షిణాలు చేస్తున్నారు. Kasipet మండలానికి మొత్తం 19 డీలర్లకు 11,202 రెండు పంపిణీ చేయాల్సి ఉంది. మొదట విడతలో 6310 చీర లు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నందున గొడవలు అవుతాయని పూర్తిస్థాయి చీరలు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం రెండో విడతలో మరో 2400 చీరలు సరఫరా చేశారు. మొత్తం 8710 చీరలు మాత్రమే మండలానికి వచ్చాయి. మిగతా 2492 చీరలు రాకపోవడంతో డీలర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. మళ్లీ వస్తే పంపిణీ చేస్తామని చెబుతుండడంతో మహిళలు డీలర్లతో గొడవలు పడుతున్నారు. ప్రతి మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. మహిళలు పలు గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్న పట్టించుకోని నాయకులు కరువయ్యారు. కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఇవ్వకపోవడం బాధాకరంగా ఉందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో సరఫరా చేయాల్సిందిగా మహిళలు కోరుతున్నారు.

 కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా వార్తలను నీ మొబైల్ కు నోటిఫికేషన్ ద్వారా పొందండి.
Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/