రెవిన్యూ గ్రామసభలపై పట్టింపేది

Kasipet news/ kasipet mandal news:-(06/09/2019):- రైతుల భూసమస్యల పరిష్కారానికి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలు అధికారుల పట్టింపు లేక నామమాత్రంగా
మారాయి.  గురువారం kasipet మండలంలోని కోనూరు గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా మధ్యాహ్నం 12 గంటలు కాకముందే అధికారులు వెళ్లిపోయారు. విరాసత్,  తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే వచ్చిన రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 5 వరకు గ్రామసభలు నిర్వహించాల్సి ఉండగా రెండు రోజులు సెలవు వచ్చాయని,  చివరి రోజు అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లాలని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుండి గ్రామాల్లో నడిచే గ్రామసభలు నామమాత్రంగా నడుస్తున్నాయని, పేరుకు మాత్రమే అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. Kasipet తహసిల్దార్ ప్రసాద్ వర్మ ను వివరణ కోరగా వారికి సమావేశం ఉన్నందున త్వరగా తిరిగి వచ్చారని రైతులు ఏవైనా సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
-Source from sakshi news

కింద కనిపిస్తున్న bell బటన్ ని క్లిక్ చేయండి మేము upload చేసిన వార్తలను నోటిఫికేషన్ ద్వారా పొందండి.
   -Kasipetnews.com

Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/