అభివృద్ధికి ఐక్యమత్యంగా పాటుపడదాం - దుర్గం చిన్నయ్య

Kasipet Mandal News:- ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా అధికారుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని Kasipet మండల సర్వసభ్య
సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. బుధవారం Kasipet మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి రోడ్డ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు,  నాయకులు హాజరయ్యారు. విద్యుత్ శాఖ, ఆర్.డబ్ల్యు.ఎస్,  అటవీ శాఖలు మినహా మిగితా అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రశాంతంగా సాగింది. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జడ్పిటిసి చంద్రయ్య, ఎంపీడీవో అలీం,  తహసిల్దార్ ప్రసాద్, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు,  కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, ఎంఈఓ దామోదర్, పశువైద్యాధికారి తిరుపతి, ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ వినయ్, వివిధ శాఖల అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.

 కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తలను మిస్ కాకుండా మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి.


Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/