లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం

Kasipet news/ Kasipet mandal news:- అంతర్జాతీయ జర్నలిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సోమగూడెం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో Kasipet  మండలంలోని పాత్రికేయులకు సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గొంది రమణ మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల సేవలు మరువలేనివి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా జర్నలిస్టులు ముందుంటారని అయినప్పటికీ పాత్రికేయులకు గుర్తింపు ఉండదన్నారు. సమస్యలతో సతమతమవుతూ సమాజం కోసం పాటుపడే జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా తమ వంతుగా జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు సన్మాన కార్యక్రమం జర్నలిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ కార్యదర్శి పెద్దపెల్లి సర్పంచ్ వేముల కృష్ణ, మాజీ అధ్యక్షుడు తీర్థాల భాస్కర్,  కోశాధికారి దూడం మహేష్,  సభ్యులు భూమయ్య,  దినేష్,  కృష్ణ,  ప్రెస్క్లబ్ అధ్యక్షులు రమేష్,  కోశాధికారి రవిరాజ్,  తిరుపతి, శెట్టి శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/