మురుగు నీరు... పట్టించుకోరు...

పారిశుధ్యం పై పట్టింపు ఏది?
30 రోజుల ప్రణాళిక లో సైతం పరిష్కారం కాని సమస్య...
అధికారులు స్పందించాలని వేడుకోలు...

Kasipet Mandal news/ kasipet news:-
Kasipet మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కన నీరు నిలిచి చెరువును తలపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్య నివారణకు ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికలో భాగంగా చర్యలు చేపడుతుండగా ఈ సమస్య పరిష్కారమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆవాసాల పక్కన బురద నీరు చేరడంతో పాటు మురుగుకాలువ లేకపోవడంతో kasipet మండలం Muthyampalli లోని రైస్ మిల్లు వరకు భూమి బురదమయంగా ఉండడంతో గ్రామస్తులకు సమస్యలు తప్పడం లేదు.
 ఈగలు,  దోమల విజృంభణ
 దోమలు,  ఈగలు,  దుర్వాసనతో పాటు విష పురుగులు సంచరిస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఎల్లప్పుడూ సింగరేణి గని ఇసుక బంకర్ నుండి వచ్చే నీటితో సైతం నీల తడిసే ఉంటుందని పిచ్చిమొక్కలు అలాగే ఉంటాయని సమస్య పరిష్కారానికి అధికారులు,  ప్రజాప్రతినిధులు కృషిచేయాలని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం 30 రోజుల కార్యాచరణలో భాగంగా ఉన్నతాధికారులు స్పందించి మురుగునీటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేనట్లయితే సుమారు 150 కుటుంబాలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.
 పిచ్చి మొక్కలు తొలగిస్తున్నా... 
 కేవలం పిచ్చిమొక్కలు తొలగిస్తూ మురుగు కాలువలు శుభ్రం చేసి ఇలాంటి పెద్ద సమస్యను నిర్లక్ష్యం చేయడం తగదని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీలో నిధులు లేవంటూ గతంలో నిర్లక్ష్యం జరిగిందని, సింగరేణి యాజమాన్యం సైతం సమస్యలు పరిష్కరిస్తామని,  పట్టించుకోవడం లేదని వెంటనే ఈ సమస్య పరిష్కరించి మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్న అధికారులు మురుగునీరు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 సమస్య పరిష్కరిస్తాం - ఆడే బాదు, సర్పంచ్
Kasipet మండలం Muthyampalli లో మురుగునీరు నిల్వ ఉండి సమస్య ఉన్న మాట వాస్తవమే. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటి ప్రాధాన్యత రూ20 లక్షలతో కాలువ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఆలోపు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మురుగునీరు ఉన్నచోట మొరం వేయించి తాత్కాలికంగా పరిష్కరిస్తాం.

-Source from sakshi

Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/