30 రోజుల ప్రణాళిక ఫలితమిచ్చేనా!

గ్రామాభివృద్ధికి మార్గం సుగమమయ్యేనా

 ప్రణాళికతో రూపురేఖలు మారేనా?

చిత్తశుద్ధితో కృషి చేస్తేనే సాధ్యం.

Kasipet mandal news/ kasipet news:-
ప్రభుత్వం గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం 30 రోజుల ప్రణాళికలు తయారు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ ప్రత్యేక నిధులు లేకపోవడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను కనుక్కోవడం తో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కాగా వీటి పరిష్కారానికి మాత్రం 30 రోజుల ప్రణాళిక కు సంబంధించి ప్రత్యేకంగా నిధుల ఊసు ఎత్తకపోవడం ఎత్తకపోవడంతో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14 ఫైనాన్స్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిధులు సైతం అందించడం లేదు. కేవలం ఎస్టి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు కొంతమేర నిధులు కేటాయిస్తూ కాలం గడిపింది. ప్రస్తుతం ప్రత్యేక నిధులు లేకున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్థాయిలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్.ఎఫ్.సీ)  రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించి ప్రణాళికలు రూపొందించింది. 30 రోజుల్లో పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్న నిధులు మాత్రం గ్రామపంచాయతీలకు అందలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదలై  నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ గ్రామపంచాయతీ ఖాతాల్లోకి చేరలేదు. 
 జనాభా ఆధారంగా నిధులు:-
 ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించిన జనాభా ఆధారంగా నిధులు గ్రామ పంచాయతీలకు చేరనున్నాయి. ఇప్పటివరకు గ్రామపంచాయతీలో ఒక వ్యక్తికి 815 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు విడతల్లో చెల్లిస్తుంది. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సైతం 815 రూపాయలు రెండు విడతలలో చెల్లించినట్లైతే మొత్తం ఒక వ్యక్తి పేరును సగటున 1,630 రూపాయలు గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు మంజూరు కానున్నాయి. ప్రస్తుతం గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు,  క్లీన్ అండ్ గ్రీన్,  హరితహారం ఇతర అన్ని పథకాలకు ఈ నిధులతో పాటు కేవలం గ్రామ పంచాయతీకి వచ్చే పన్నుల రూపంలో అన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ఎప్పటి మాదిరి నిధులు మాత్రమే ఉండటం కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తామనడంతో  ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికల అమలు సమస్యల పరిష్కారం సాధ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు చిన్న గ్రామపంచాయతీలే  ఉండటంతో గ్రామపంచాయతీల్లో  సమస్యల పరిష్కారం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం హరితహారంతో పాటు సిసి రోడ్లు, ఇతర నిర్మాణాలకు ఎక్కువ శాతం ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ ( కేంద్ర ప్రభుత్వం నిధులు) వినియోగించుకునే ఏర్పాటు చేస్తుంది. వీటి కేటాయింపులో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు అన్ని గ్రామ పంచాయతీలకు సమానంగా కేటాయించకపోవడంతో చాలా గ్రామపంచాయతీలు అభివృద్ధికి దూరంగానే ఉండాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించినట్లయితేనే  గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా ఆలోచించాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. గ్రామాలాభివృద్ధి  సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
Source from sakshi epaper kasipet.

కింద కనిపిస్తున్న bell బటన్ ని క్లిక్ చేయండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ పొందండి.
Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/