మదర్ థెరిస్సా సేవలు మరువలేనివి

Kasipet news/ Devapur:-
సేవాభావంలో పేదలను ఆదరించిన మదర్ థెరిస్సా సేవలు మరువలేనివని సోమగూడెం లయన్స్ క్లబ్
అధ్యక్షుడు గొందిరాయల్స్, నిర్వహుడు గొంది వెంకటరమణ తెలిపారు. మంగళవారం మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని kasipet మండలంలోని దేవాపూర్ డిస్పెన్సరీలో ఆదివాసులకు సేవలు అందిస్తున్న నర్స్ శ్రీలతను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. మదర్ థెరిస్సా అన్ని వర్గాల ప్రజలను ఆదరించినట్లు వైద్య వృత్తిలోని వారు ఆదివాసులను, పేదలను ఆధరించి సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో  వైద్యురాలు శ్రీవిద్య, వైద్యుడు ప్రేమ్ సాగర్, స్థానిక నాయకులు మడావి అనంతరావు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/