Kasipet News:- మందమరి ఏరియా కాసిపేట గనిలో పర్మినెంట్ కాంట్రాక్టులు పనిచేసే చోట కాంట్రాక్టు కార్మికులను ప్రవేశపెట్టిన యాజమాన్యం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో
శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం మేనేజర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏరియాలోని కాసిపేట గనిలో కొన్ని రోజులుగా కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయన్నారు. కాసిపేట, కాసిపేట 2 ఇంక్లైన్, కంటిన్యూమైనర్లను ప్రవేశపెట్టి కాంట్రాక్టీకరణ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని 5వ షెడ్యూల్ ను ప్రమోగిస్తూ కార్మికులను, కార్మిక నాయకులపై అన్ఫైర్ లేబర్ ప్రాసెస్ కొనసాగిస్తున్నారన్నారు. కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమరి బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ ఇంచార్జ్ చిన్న నర్సయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ బియ్యాల వెంకటస్వామి, నాయకులు మినుగు లష్మినారాయణ, జనార్దన్, రాజయ్య, ఢీకొండ నర్సయ్య, రాజమొగిళి, రాములు, రవీందర్ పాల్గొన్నారు.