ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డీఐఈవో కి వినతిపత్రం అందజేత

Kasipet News:- Kasipet మండలంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్  రవీందర్ పైన చర్యలు తీసుకోవాలని గురువారం ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఐఈవో కార్యాలయంలో  వినతిపత్రం అందజేశారు. గత 20 రోజులుగా అక్క స్థానంలో చెల్లెలు గెస్ట్ టీచర్ గా పనిచేస్తున్నా పట్టించుకోకుండా  ఈ విషయాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.  విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఎవరో తెలియని టీచర్ ని నియమించిన ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలనీ లేదంటే ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఐఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. డీఐఈవో మాట్లాడుతూ కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్ పై విచారణ జరిపి, నిర్ధారణ అయితే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో సంక్షేమ హాస్టల్ ఇంచార్జ్ సమ్మయ్య,  ఎంఎస్ఎఫ్ జిల్లా ఇంచార్జ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక విషయంలోకి వెళ్తే kasipet మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న విజయ మెటర్నరీ లీవ్ లో ఉంది. కాలేజీ ప్రిన్సిపాల్  రవీందర్ విజయకు బదులుగా తన చెల్లెలు మాణిక్యకుమారిని పాటలు చెప్పడానికి నియమించాడు. ఈ విషయం 20 రోజుల తరువాత బుధవారం ఆలస్యం బయటకుతెలిసింది. 20 రోజులుగా పాఠాలు చెబుతున్న  లెక్చరర్ పేరు విద్యార్థులకు తెలియకపోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

Created By SHIVA. Copyright © Reserved with https://www.kasipetnews.com/