Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

హరితహారం గడువు 5 రోజులే... ఇప్పటికి 50% పూర్తి


Kasipet news

హరితహారం గడువు 5 రోజులే...  ఇప్పటికి 50% పూర్తి:-

Kasipet news:- ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టే హరితహారం కార్యక్రమానికి అధికారులు కేటాయించిన గడువు మరో ఐదు రోజుల్లో
ముగియనుండగా, ప్రస్తుతం kasipet మండలం 50% మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగితా ఐదురోజుల్లో వందశాతం లక్ష్యం చేరేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం అన్ని శాఖలను భాగస్వామ్యం చేసినప్పటికి కేవలం ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు మాత్రమే హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈనెల 31 వరకు అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉండగా వందశాతం లక్ష్యాన్ని పూర్తిచేయడం కష్టంగా మారింది. Kasipet మండలంలో మొత్తం 22 నర్సరీల్లో 11 లక్షల 30 వేల, 6.10 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టారు. అందులో ఇప్పటికే 8 లక్షల మొక్కలు పెంచి పంపిణీకి సిద్ధం చేయగా, 2.98 లక్షల మక్కలు పంపిణి చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లే మొక్కల పంపిణి కీలకంగా చేపడుతున్నారు. ఇతర శాఖలకు సంబందించిన అధికారులు, సిబ్బంది పాల్గొనకపోవడంతో లక్ష్యంపై అనుమానాలు వక్తం అవుతున్నాయి. టేకు, ఉసిరి, దానిమ్మ, జామ, బొప్పాయి, మారేడు, నిమ్మ, మునిగ, కానుగ, వేప, తులసి, ఈత, సీతాఫలం వివిధ రకాలైన, మొక్కలను అందుబాటులో ఉంచి ఇంటింటికి పంపిణి చేస్తున్నారు.
రైతులనుండి స్పందన కరువు :-
హరితహారం లో భాగంగా పొలం, చేల గట్లపై మొక్కలు పెంచాల్సి ఉండగా రైతులనుండి స్పందన కరువైనది. మొక్కలను చేన్లలోకి తరలించేందుకు ఈజీఎస్ ద్వారా మొక్కకు 50 పైసల చొప్పున రవాణా ఖర్చులు చెల్లించడం జరుగుతుంది. చేలలో గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం ఈజీఎస్ ఆధ్వర్యంలో కూలీలే చేపడతారు. కాగా కాగా రైతులు మాత్రం మొక్కలు తమ చేల వద్దకు తీసుకువచ్చి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఎలాగో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇద్దరు, ముగ్గురు రైతులతో మాట్లాడి మొక్కలను తరలించడం జరుగుతుంది. ఎటువైపు నుండి ప్రోత్సాహం లేకపోవడంతో లక్ష్యం చేరుకునేందుకు తీవ్ర సమస్యలు పడుతున్నట్టు సిబ్బంది వాపోతున్నారు. బురదలో చేలు, పొలాల వద్దకు వెళ్లలేక పోతున్నామని, రైతుల సహకారం లేక ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వక్త్యం చేస్తున్నారు.  అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి వస్తే తప్ప లక్ష్యం చేరడం అనుమానంగానే ఉంది. నర్సరీల పెంపకంలో ఉన్న శ్రద్ధ మొక్కలు నాటడంలో చూపించడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్యసాధన కష్టతరమవుతుందనే చెప్పవచ్చు.
ఏపీవో ఈజీఎస్ స్వాతి గారు  మాట్లాడుతూ... 
వాతావరణం ఇబ్బంధులు, ఇతర సమస్యలతో ఈ సంవత్సరం హరితహారంలో మొక్కలు నాటడంలో సమస్యలు కలుగుతున్నాయి. ఏదీ ఏమైనా అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయతిస్తాం అని, రైతులు మరియు ప్రజలు సహకరించి మొక్కలు నాటాలని చెప్పారు. సిబ్బంది సైతం వారి పని వారు చేసుకుంటున్నాం. గడువు లోగా వంద శాతం లక్ష్యానికి కలిసికట్టుగా ముందుకు సాగుతాం. మొక్కల సంరక్షణకు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని అన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App