Kasipet Mandal News:- Kasipet మండల కేంద్రంలో ఆదివారం సర్పంచ్ దేవి, ఎంపీటీసీ లక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికి పండ్ల మొక్కలు
పంపిణి చేశారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొక్కలు నాటి ఉసిరి, దానిమ్మ, బొప్పాయి మరియు ఇతర పండ్ల మొక్కలను గ్రామస్థులకు అందజేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వీవో అక్తర్ ఖాన్, ఉపసర్పంచ్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మన్, స్థానిక నాయకులు, భువనాంబ, దాగం మల్లేష్, బన్న ఆశాలు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.