ఉద్యోగవిరమణ చేస్తున్న కార్మికునికి సన్మానం
Kasipet News:- మందమర్రి ఏరియా Kasipet గనిపై ఉద్యోగవిరమణ చేసిన ఏ రిలే కు చెందిన
సపోర్ట్ మెన్ అచ్చే అర్జయ్య దంపతులను శుక్రవారం కార్మికసంఘాల నాయకులు, గని మేనేజర్ మరియు గ్రూప్ అఫ్ ఏజెంట్ కుర్మ రాజేందర్ సన్మానించారు. అచ్చే అర్జయ్య 35 సంవత్సరాలు గని కార్మికునిగా పనిచేసాడు. గ్రూప్ అఫ్ ఏజెంట్ కుర్మ రాజేందర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని, ఇన్ని సంవత్సరాలు కార్మికునిగా పనిచేసి ఉత్పత్తిలో పాల్గొన్నందుకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ భూ శంకరయ్య, డిప్యూటీ మేనేజర్ అల్లా ఉద్దీన్, ఇంజనీర్ శేఖర్, సేఫ్టీ ఆఫీసర్ సునీల్ మరియు గని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.